అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్

ఉక్కుపాదం తుక్కయింది

Posted in వార్తలు by dilkibaatein on డిసెంబర్ 24, 2008

ఈనాడు దినపత్రిక నుండి…

భూమి కోసం రైతన్నల ఆందోళన | పోలీసుల కాళ్లు మొక్కారు
లాఠీ దెబ్బలు తిన్నారు
| 20 మంది గాయాల పాలు
రణరంగంగా ‘కాకినాడ సెజ్‌’ గ్రామాలు
| ప్రతిఘటనతో ప్రభుత్వం వెనక్కి
కాకినాడ, కొత్తపల్లి, న్యూస్‌టుడే

kakinada-sez-eenadu1


ఆ గ్రామాలు శత్రుదేశంలో భాగాలు కాదు..
అక్కడ విద్రోహ కార్యకలాపాలేవీ జరగడం లేదు..
కానీ తమ భూములను లాక్కోవద్దని మొరపెట్టుకుంటున్న వారిపై ప్రభుత్వం అక్కడ తన మార్కు దందా చూపించింది…
పిల్లలు, పెద్దలను ఎవరినీ వదలకుండా భయభ్రాంతులకు గురిచేసింది. తెల్లవారేసరికి 13 గ్రామాలను చుట్టుముట్టింది. ఒకరుకాదు ఇద్దరుకాదు వెయ్యిమంది పోలీసులను దీనికోసం వినియోగించింది. అభం శుభం ఎరుగని అన్నదాతలపై వారంతా విరుచుకుపడ్డారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న పచ్చని చేలన్నీ సెజ్‌ కంపెనీవంటూ వాటి చుట్టూ కంచె నిర్మించడానికి పూనుకున్నారు. అడ్డొచ్చిన బాధితులపై లాఠీలను ఝుళిపించారు. అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. తమ ఆందోళనను కొనసాగిస్తూ పోలీసులను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనలో చివరకు ప్రభుత్వం వెనక్కు తగ్గక తప్పలేదు…

kakinada-sez-eenadu2

చట్టాలు, న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమకారుల హెచ్చరికలు… ఇవేవీ పట్టించుకోకుండా మొదటి నుంచీ అధికారులు, పోలీసులు సెజ్‌ కంపెనీ అడుగులకు మడుగులొత్తుతూనే ఉన్నారు. ప్రత్యేక ఆర్థికమండలికి కావలసిన ఎనిమిదివేల ఎకరాలను కంపెనీ సేకరించాల్సి ఉండగా, ఆ బాధ్యతను ఈ రెండువర్గాలు పూర్తిగా తలకెత్తుకున్నాయి. భూములను ఇవ్వని రైతులను బెదిరించి మరీ కొనుగోలు చేశాయి. ఇప్పుడు భూసేకరణ పూర్తయిందని వారందరినీ ఖాళీ చేయించడానికి పూనుకున్నాయి. దీంతో కాకినాడ సమీపంలోని తీరప్రాంతం రణరంగంగా మారింది. కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సుమారు 14 కిలోమీటర్ల పొడవునా సుమారు మూడు వేల ఎకరాల భూమిని పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకోవాలనుకున్న సెజ్‌ అధికారులకు చివరకు చేదు అనుభవం ఎదురైంది. కాగా సోమవారం రాత్రి నుంచే గ్రామాలను ముట్టడించేందుకు వ్యూహం రచించారు. జిల్లాలోని అన్ని స్టేషన్ల నుంచి పోలీసులను సమీకరించారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి శ్రీరాంపురం, మూలపేట, రావివారిపోడు గ్రామాల్లో సెజ్‌ వ్యతిరేక పోరాట నాయకుల గురించి గాలించారు.
(more…)

‘ఖాకీ’ నాడ సెజ్‌

Posted in వార్తలు by dilkibaatein on డిసెంబర్ 24, 2008

ఆంధ్రజ్యోతి నుండి…

తిరగబడ్డ రైతు బిడ్డ | భూమి కోసం పోలీసులపై పోరు
కాకినాడ సెజ్‌ గ్రాయాల్లో సర్కారు జులుం
| 11 గ్రామాలపై 2 వేల మంది పోలీసుల దాడి
భూముల స్వాధీనానికి యత్నం
| ఊళ్లు ఖాళీ చేయించే ప్రయోగం
క ర్రలతో తిరగబడిన బాధిత జనం
| చావనైనా చస్తాం,, ఈ నేల వదలం
సర్కారుపై ప్రజల నిరసన గళం
| తోకముడిచిన అధికారగణం
లాఠీచార్జి.. తోపులాటల్లో పలువురికి గాయాలు
| రణరంగాన్ని తలపించిన తీరం గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత

kakinada-sez-aj1


ఇద్దరు డీఎస్‌పీలు, పెద్దసంఖ్యలో సీఐలు, ఎస్‌ఐలతో సహా సుమారు రెండువేల మంది పోలీసులు… భారీగా రెవెన్యూ అధికారులు… వారితోపాటు ఫైరింజన్లు, 108 అంబులెన్స్‌లు! అంతా కలిసి 11 గ్రామాలపై ‘దాడి’ చేశారు. ఇది నక్సల్స్‌ కోసం వేట కాదు. సంఘ విద్రోహ శక్తులకోసం అన్వేషణ అంతకంటే కాదు. పొలాల చుట్టూ కంచెలు వేసి… కొన్ని గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించేందుకే ఈ దాడి!

అధికారుల ఆటవిక దాడిపై జనం ఆగ్రహించారు. ఎదురు తిరిగారు. తమ భూములు ఇచ్చేది లేదన్నారు. కంచెలు తొలగించారు. స్తంభాలను విరిచేశారు. ఆధిపత్యం కోసం అధికారుల ప్రయత్నం… బతుకు బాట కోసం సామాన్యుల పోరాటం… వెరసి ఆ దృశ్యం చిన్నసైజు సమరాన్ని తలపించింది. కాకినాడ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ కోసం చేపట్టిన భూ స్వాధీనం కోసం సర్కారు చేపట్టిన ‘నిర్బంధ కాండ’ ప్రస్తుతానికి విఫలమైంది.

(more…)

సెజ్‌ గ్రామాల్లో సర్కార్‌ జులుం

Posted in వార్తలు by JayaPrakash Telangana on డిసెంబర్ 24, 2008

భూముల స్వాధీనానికి విఫలయత్నం ఎదురుతిరిగిన బాధితులు

(ఆన్‌లైన్‌ ప్రతినిధి-కాకినాడ) కాకినాడ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (కెఎస్‌ఇజెడ్‌) కోసం భూముల్ని సేకరించేందుకు, గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం యంత్రాంగం మంగళవారం నాడు తెగబడింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన పదకొండు గ్రామాలపై సుమారు రెండు వేల మంది పోలీసులు విరుచుకుపడ్డారు.

(more…)