అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్

‘వలస’ వాదం

Posted in వ్యాసాలు by JayaPrakash Telangana on మార్చి 15, 2009

వలసలను ప్రోత్సహించాలంటూ, సమతుల్య ప్రగతికి బదులుగా నగరాలలోనే అభివృద్ధి పథకాలను కేంద్రీకరించాలంటూ ప్రపంచ బ్యాంకు సూచిస్తున్న చికిత్సా విధానం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపో యే విధంగా ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రవచిస్తున్న ఈ అభివృద్ధి నమూనా స్థాని క ప్రజల కోసమా లేక ప్రకృతి, మానవ వనరులను యధేచ్ఛగా, చౌకగా కొల్లగొడుతూ, పెట్టుబడుల ప్రవాహానికి అన్ని రకాల అడ్డంకులను తొలగించడానికా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలే ఇక్కడి ప్రభుత్వాలకు శిరోధార్యమైన నేపథ్యంలో, ఈ అభివృద్ధి నమూనా పర్యవసానాలను చర్చించుకోవలసి ఉంది. ప్రపంచ బ్యాంకు పదేళ్ళుగా ప్రతి ఏటా అభివృద్ధి నివేదికల పేర తమ సూచనలను వెలువరుస్తున్నది.

‘ప్రపంచ అభివృద్ధి నివేదిక- 2009: ఆర్థిక భౌగోళిక రూపు రేఖల మార్పు’ పేర ఈ ఏడాది నివేదికను గురువారం విడుదల చేసింది. ఈ నివేదికలో అభివృద్ధి కోసం వలసలను ప్రోత్సహించడం వంటి సూచనలు చేసింది. అంతే కాదు, సమతుల్య అభివృద్ధికి బదులుగా నగరాలలోనే అభివృద్ధి ని కేంద్రీకరించాలని అభిప్రాయపడింది. పైగా ఈ అభివృద్ధి నమూనా వల్ల పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందనే వాదన వినిపించింది. గ్రామాల నుంచి నగరాలకు ఎవరు వెళ్ళదలుచుకున్నా, అందుకు ఎవరూ అభ్యంతర పెట్టరు. అయితే అది భిన్నమైన జీవనం కోసం లేదా స్థానికంగా లభించని కొత్త అవకాశాల కోసం స్వచ్ఛందంగా మనిషి సాగించే యాత్ర అయి ఉండాలి. కానీ ప్రపంచ బ్యాంకు చెబుతున్న అభివృద్ధి నమూనా ప్రకారం- గ్రామీణ ప్రాంతం నుంచి నగరాలకు జనం పెళ్ళి ఊరేగింపులా గానా బజానాలతో సాగరనేది జగద్విదితం.

ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే విధానాలను అటకెక్కించాలనీ, పారిశ్రామిక నగరాలు రూపుదిద్దుకోవడానికి ఉమ్మడి వ్యవస్థల ను నెలకొల్పాలని ప్రపంచ బ్యాంకు తమ నివేదికలో సూచించింది. ఈ సూచన ప్రకారం- పల్లె జనం అవకాశాలు దొరక్క మలమల మాడిపోలేక పొట్ట చేత పట్టుకుని నగరాలలో వలస కూలీలుగా మారవలసి ఉంటుంది. మహబూబ్‌ నగర్‌, అనంతపురం కరువు సీమలుగా కటకటలాడుతూ ఉంటే, బడుగు జీవి బొంబై బస్కెక్కి గుర్తు తెలియని ప్రపంచంలో దినమొక గండంగా బతకాలి. ఈ సామాజిక సంక్షోభాన్ని చరిత్ర యావత్తూ, ప్రపంచమంతటా సాధారణమైందిగా ప్రపం చ బ్యాంకు పేర్కొనడం మరీ వింతగా ఉంది. ఉత్పత్తి నగరాలలో కేంద్రీకృతమై ఉండడం సహజమైందిగా చెబుతున్న ప్రపంచ బ్యాంకు గ్రామీణ, సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను విస్మరించింది. వ్యవసాయ, గ్రామీణ సంపదనే పట్టణాల అభివృద్ధికి ఉపయోపడిందనేది గుర్తించడం లేదు.

వలసలను ప్రోత్సహించడం వల్ల నగరాలలో మురికి వాడలు పెరుగుతాయ ని ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. ఇందుకు వసతులను మెరుగుపరచడం వంటి సూచనలు సమంజసంగానే ఉన్నాయి. కానీ పశ్చిమ యూరప్‌తోపాటు టోక్యో, బీజింగ్‌, ముంబయి వంటి నగరాలు జనసాంద్రతతో, తక్కువ దూరం కలిగి, సామాజిక అడ్డంకులు లేక పోవడం వల్ల కళకళలాడుతున్నాయనేది ప్రపం చ బ్యాంకు ఆర్థికవేత్తల సమర్థన. కానీ అనుదినం దూర ప్రయాణాల వల్ల ముంబయిలోనే చాలా మంది పిల్లలు తండ్రి ముఖం చూడకుండానే పెరుగుతున్నారని అక్కడి ఉద్యోగుల స్వీయానుభవం చెబుతున్నది.

బ్రిటన్‌లోని కొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో, కుటుంబాలు అదృశ్యమై, సమాజం కేవలం కర్మాగారా లు- కార్మికులుగా మారిపోయిందనేది వాస్తవం. జీవనావకాశాలను వెదక్కొం టూ, ప్రజలు వలస పోతారని, 1990 దశకం పూర్వార్దంలో బీహార్‌, ఉత్తర ప్రదే శ్‌ వంటి రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర ప్రాంతాలకు మూడు కోట్ల మంది తరలి వెళ్ళారని ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. అయి తే ఈ అసమతుల్య అభివృద్ధి సృష్టించిన సంక్షోభాన్ని మాత్రం వివరించలేదు. ఉదాహరణకు- ఒక ఏడాది అసోంలోని 2,750 రైల్వే ఉద్యోగాలకు బీహార్‌ నుంచి 20వేల దరఖాస్తులు వచ్చాయంటే ఈ వలసల వెనుక గల దైన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అటు అసోం లో, ఇటు ముంబయిలో బీహారీలపై దాడులు సాగడం ఇంకా మరుపునకు రాకముందే, ప్రపంచ బ్యాంకు ఈ సూచనలు ఇవ్వడం విచిత్రంగా ఉంది.

అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గర్వపడుతున్న గుజరాత్‌లో ‘ప్రాజెక్టుల నిర్మాణానికి పాలమూర్‌ లేబర్‌’ మాదిరిగా ఒక్కో ప్రాంతం కూలీలు ఒక్కో పనికి స్థిరపడి పోయారు. ఆయా సీజన్‌లలో కాంట్రాక్టర్లు తరలించిన చోటికల్లా పోయి పూటగడుపుతున్నారు. అంటే గ్రామీణ ప్రాంతం నుంచి నగరానికి వలస ఒక్కనాటితో తీరేది కాదు. పొట్ట పోసుకోవడానికి నిరంతరం ఈ కూలీల యాత్ర సాగుతూనే ఉంటుంది. స్థానికుల మాదిరిగా వలస కూలీలు అధిక వేతనాలు కోరరు. ఎక్కు వ కాలం ఉండరు. వ్యవస్థీకృతంగా, జీవిత భద్రతతో జీవించలేరు. పెట్టుబడుల కు, కూలీల వలసకు అడ్డంకులు ఉండవద్దనేది ప్రపంచ బ్యాంకు నివేదికలోని ప్రధాన సూచన. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వనరులున్న చోటికి వ్యాపార కంపెనీలు తరలిపోతూనే ఉండాలి.

వాటికి ‘చీప్‌ లేబర్‌’ అభిస్తూనే ఉండాలి అనేది నివేదికలోని అంతర్యం. ఒకనాడు బానిసలను అట్లాంటిక్‌ అవతలి తీరానికి బలవంతంగా పట్టుకు వెళ్లి నా, ఆ తరువాత వలస ప్రభువులు సీమాంతర చెరుకు, తేయాకు తోటల్లోకి కూలీలను తరలించినా, నేడు సంపదను పోగేసుకుని అమెరికా దాకా మన ఖర్చుతో శిక్ష ణ పొందిన నిపుణులను మురిపెంగా రప్పించుకున్నా, రేపు మన ప్రాంతాలలోనే వనరులను చౌకగా చేజిక్కించుకుని నగరాలలో, ఓడరేవుల వద్ద సెజ్‌ సామ్రాజ్యా లు స్థాపించుకున్నా అంతిమ లక్ష్యం చీప్‌ లేబర్‌ను దోచుకోవడమే. పెట్టుబడులు శాసించే విస్తృత అభివృద్ధి నమూనాలో, వ్యక్తిగత స్వేచ్ఛ పరిమితమే. వలస కార్మికులంతా స్వచ్ఛంద బానిసలే! ఈ అభివృద్ధి నమూనానే ఆమోదిస్తే, రేపు దేశమం తా మరింత అసమానతల మయమవుతుంది. ఉపాధి అవకాశాల కోసం సాగే జాతి కలహాలతో దేశం కుతకుతలాడి పోయే ప్రమాదం ఉంది.

(సౌజన్యం: ఆంధ్రజ్యోతి సంపాదకీయం, 14 మార్చ్ 2009)

ప్రత్యుత్తరమిమ్ము