అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్

60 tainted MLAs ! Welcome to Andhra Pradesh !!

Posted in వ్యాసాలు by JayaPrakash Telangana on ఏప్రిల్ 3, 2009
Whenever we talk of criminals & goondas in politics, Bihar and UP come to our mind. Now Andhra Pradesh is competing and trying hard to bag the coveted honour of being the state with most elected representatives with criminal charges against them.

As part of National Election Watch, in Andhra Pradesh, we released the list of sitting MLAs and MPs from Andhra Pradesh with criminal charges today.
Read the complete article by Rakesh, 60 tainted MLAs !!!! Welcome to Andhra Pradesh…

‘వలస’ వాదం

Posted in వ్యాసాలు by JayaPrakash Telangana on మార్చి 15, 2009

వలసలను ప్రోత్సహించాలంటూ, సమతుల్య ప్రగతికి బదులుగా నగరాలలోనే అభివృద్ధి పథకాలను కేంద్రీకరించాలంటూ ప్రపంచ బ్యాంకు సూచిస్తున్న చికిత్సా విధానం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపో యే విధంగా ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రవచిస్తున్న ఈ అభివృద్ధి నమూనా స్థాని క ప్రజల కోసమా లేక ప్రకృతి, మానవ వనరులను యధేచ్ఛగా, చౌకగా కొల్లగొడుతూ, పెట్టుబడుల ప్రవాహానికి అన్ని రకాల అడ్డంకులను తొలగించడానికా అనే ప్రశ్న తలెత్తుతున్నది. (more…)

‘మేటాన్‌’ (Maytas) నిజాలు

Posted in వార్తలు by JayaPrakash Telangana on జనవరి 7, 2009

‘సత్యం’ రామలింగరాజు రాజీనామా | రూ. 7000 కోట్ల ఫ్రాడ్‌, స్టాక్‌మార్కెట్‌ క్రాష్‌

Satyame Maytas poster

Satyame Maytas poster

హైదరాబాద్‌, జనవరి 7 :  ఒక మహా పర్వతం కుప్పకూలిపోయింది. తెలుగువారి సాఫ్ట్‌ వేర్‌ నైపుణ్యానికి ప్రతీకగా అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటి వరకు సగర్వంగా తలెత్తుకు తిరిగిన సత్యం’ కంపెనీ బుధవారం నాడు దోషిగా నడిరోడ్డుపై నిల్చుంది. ఈ కంపెనీ అక్రమాల పుట్టగా, అవినీతికి పెట్టని కోటగా మారిపోవడంతో జరిగిన అన్ని దారుణాలకూ బాధ్యత వహిస్తూ సత్యం ఛైర్మన్‌ రామలింగరాజు బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. క్షణాలలో మార్కెట్‌లో సత్యం షేర్ల పతనం ప్రారంభమైంది. (more…)

తీపి కబురు

Posted in వార్తలు by JayaPrakash Telangana on జనవరి 7, 2009
  • కలెక్టరేట్‌ ఎదుట ఇక ధర్నాలుండవు
  • వారం ముందే నిరసనకు అనుమతి అవసరం
  • రాజకీయ పార్టీల్లో ఆందోళన

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం,న్యూస్‌టుడే: రోజుకో రాస్తారోకో..రెండురోజులకోసారి ధర్నా..ట్రాఫిక్‌జాం..వీటితో వేగలేకపోతున్నాం..సమయానికి గమ్యం చేరలేకపోతున్నాం..మానసిక ఆందోళనకు గురవుతున్నాం..ఎందుకు మాకీ పరీక్ష..అని ఇంతకాలం ఆవేదన చెందిన వారికో శుభవార్త..ఇక నుంచి మీకు ఆ ఇబ్బందులు ఉండవ్‌..పట్టణంలోని ప్రధాన రహదారుల మీద రోడ్‌షోలు, ధర్నాలు, నిరసనలను పోలీసు శాఖ రద్దు చేసింది..ఈ తీపి కబురు సామాన్యులకు ఆనందం కల్గిస్తుండగా..రాజకీయ పార్టీల్లో మాత్రం ఆందోళన రేపుతోంది.. (more…)

మురికివాడల మెడపై సర్కారు కత్తి

Posted in వార్తలు by JayaPrakash Telangana on డిసెంబర్ 30, 2008

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : పేదల పక్షపాత ప్రభుత్వాలు మురికివాడల ఉసురు తీస్తున్నాయి. పార్టీల కార్యాలయాల కోసం, బడాబాబుల కోసం పేదల గూడును కూల్చేస్తున్నాయి. బాధితులను నగర శివార్లకు విసిరేస్తున్నాయి. వాళ్లు బతుకులను రోడ్డున పడేస్తున్నాయి. మొన్నటి నవనిర్మాణ్‌నగర్‌ నుంచి ఇప్పటి భీంరావ్‌బాడ వరకూ సర్కార్ల తీరు ఇదే . జూబ్లీహిల్స్‌లోని నవనిర్మాణ్‌నగర్‌ వాసులు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లలోని మధ్యతరగతి, ధనిక వర్గాల ఇళ్లలో పనిచేస్తూ జీవించేవారు. అక్కడ ఇళ్లు ఉన్నంత వరకే ఇదంతా. అధికారులు నవనిర్మాణ్‌నగర్‌లోని ఇళ్లను తొలగించారు. పేదలను కూకట్‌పల్లిలోని శంషీగూడకు తరలించారు. దాంతో ఉపాధి పోయింది. వాళ్ల జీవితాలు వీధిన పడ్డాయి.
(more…)

పేదల బస్తీపై కబంధ ‘హస్తం’, నడిరాత్రి ప్రభుత్వ విధ్వంసం !

Posted in వార్తలు by JayaPrakash Telangana on డిసెంబర్ 28, 2008

గూండా సర్కార్‌ | ఇందిరా భవన్‌ కోసం ‘ఇందిరమ్మ ఎమర్జెన్సీ’

భీమ్‌రావ్‌బాడ నేలమట్టం | కరెంటు తీసేసి బలవంతపు తరలింపు

కోర్టుకు సెలవులు చూసుకుని బరితెగింపు | మండిపడ్డ విపక్షాలు.. అగ్రనేతల ఆందోళన

చంద్రబాబు, రాఘవులు, దత్తా త్రేయ, సురవరం, | హరీశ్‌రావు, పవన్‌ కల్యాణ్‌ తదితరుల అరెస్టు

హౌస్‌ మోషన్‌ను అనుమతించిన న్యాయస్థానం | తదుపరి చర్యలు చేపట్టరాదని ఆదేశం

122708_aj1బడుగు గుడిసెల శిథిలాల మీదే ఒక పార్టీ కార్యాలయం లేవాలా?.. అధికార పార్టీ హంగూ ఆర్భాటాల కోసం నిరుపేద బతుకుల పునాదులను తవ్వాలా?.. కాంగ్రెస్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఒక బస్తీ మొత్తాన్ని బలి చేయాలా?.. గ్రేటర్‌ అవతారమెత్తి, నలుదిశలకూ విస్తరించిన ఇంత సువిశాలమైన రాజధాని నగరంలో మరెక్కడా కాసింత చోటే చిక్కలేదా?

తనదే అధికారం… తన చేతిలో ఉన్న ప్రభుత్వం… కావాల్సింది సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కాసింత స్థలం. టీడీపీ, టీఆర్‌ఎస్‌, ప్రజారాజ్యం పార్టీ కార్యాలయాలు కొలువుదీరిన జూబ్లీహిల్స్‌లోనో, ఇంకెక్కడో, మరెక్కడో ఆ స్థలం దొరకదా? కాదూ కూడదని, ఆ స్థలమే కావాలని… పగబట్టినట్లుగా పట్టుపట్టి… బడుగుల గుడిసెలు పడగొట్టి… రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి వెళ్లగొట్టి… నానా బీభత్సం సృష్టించాలా?

(more…)

పెద్దలకు జీ హుజూర్‌! పేదలపై కత్తి తయార్‌!

Posted in వార్తలు by JayaPrakash Telangana on డిసెంబర్ 27, 2008

భూముల క్రమబద్దీకరణలో ద్వంద్వ విధానం | బడుగుల భూముల స్వాధీనం బడా బాబులకు ధారాదత్తం

చట్టం ముందు అందరూ సమానమే. కానీ… డబ్బున్నవాళ్లు కాస్త ‘ఎక్కువ’ సమానం! ప్రభుత్వం అందరి సంక్షేమాన్ని చూడాలి. కానీ… అస్మదీయుల సంక్షేమం పట్ల ప్రత్యేక ఆసక్తి! నిబంధనల అంకుశంతో అందరినీ ఒకేలా పొడవాలి. కానీ… పెద్దల విషయంలో వాటికి సవరణల కవచం పుట్టుకొస్తుంది. సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలు పేదలవైపే నిలవాలి. ప్రభుత్వం మాత్రం పెద్దలకే కొమ్ముకాస్తోంది. ఒకేచోట.. ఒకే కిలోమీటర్‌ పరిధిలో… పేదలకు ఒక’లా’! పెద్దలకు ఇంకో’లా’! ఒకటా… రెండా… ఇందుకు ఎన్నో నిదర్శనాలు.

(హైదరాబాద్‌ – ఆన్‌లైన్‌ సిటీబ్యూరో) హైదరాబాద్‌లోని షేక్‌పేట మండలం నవనిర్మాణ్‌నగర్‌లో పాతికేళ్లుగా నివసిస్తున్న పేదలపై ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ మురికివాడను ప్రభు త్వం ఏకంగా వేలానికి పెట్టింది. వెబ్‌సైట్‌లో భూముల వివరాలు పొందుపరిచింది. రిసోర్స్‌ మొబిలైజేషన్‌ పేరిట భూమిని స్వాధీనం చేసుకొని, 150 కుటుంబాలను ఒక్కరోజులో వీధిన పడేసింది.

(more…)

ఉక్కుపాదం తుక్కయింది

Posted in వార్తలు by dilkibaatein on డిసెంబర్ 24, 2008

ఈనాడు దినపత్రిక నుండి…

భూమి కోసం రైతన్నల ఆందోళన | పోలీసుల కాళ్లు మొక్కారు
లాఠీ దెబ్బలు తిన్నారు
| 20 మంది గాయాల పాలు
రణరంగంగా ‘కాకినాడ సెజ్‌’ గ్రామాలు
| ప్రతిఘటనతో ప్రభుత్వం వెనక్కి
కాకినాడ, కొత్తపల్లి, న్యూస్‌టుడే

kakinada-sez-eenadu1


ఆ గ్రామాలు శత్రుదేశంలో భాగాలు కాదు..
అక్కడ విద్రోహ కార్యకలాపాలేవీ జరగడం లేదు..
కానీ తమ భూములను లాక్కోవద్దని మొరపెట్టుకుంటున్న వారిపై ప్రభుత్వం అక్కడ తన మార్కు దందా చూపించింది…
పిల్లలు, పెద్దలను ఎవరినీ వదలకుండా భయభ్రాంతులకు గురిచేసింది. తెల్లవారేసరికి 13 గ్రామాలను చుట్టుముట్టింది. ఒకరుకాదు ఇద్దరుకాదు వెయ్యిమంది పోలీసులను దీనికోసం వినియోగించింది. అభం శుభం ఎరుగని అన్నదాతలపై వారంతా విరుచుకుపడ్డారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న పచ్చని చేలన్నీ సెజ్‌ కంపెనీవంటూ వాటి చుట్టూ కంచె నిర్మించడానికి పూనుకున్నారు. అడ్డొచ్చిన బాధితులపై లాఠీలను ఝుళిపించారు. అయినా రైతులు వెనక్కు తగ్గలేదు. తమ ఆందోళనను కొనసాగిస్తూ పోలీసులను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనలో చివరకు ప్రభుత్వం వెనక్కు తగ్గక తప్పలేదు…

kakinada-sez-eenadu2

చట్టాలు, న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమకారుల హెచ్చరికలు… ఇవేవీ పట్టించుకోకుండా మొదటి నుంచీ అధికారులు, పోలీసులు సెజ్‌ కంపెనీ అడుగులకు మడుగులొత్తుతూనే ఉన్నారు. ప్రత్యేక ఆర్థికమండలికి కావలసిన ఎనిమిదివేల ఎకరాలను కంపెనీ సేకరించాల్సి ఉండగా, ఆ బాధ్యతను ఈ రెండువర్గాలు పూర్తిగా తలకెత్తుకున్నాయి. భూములను ఇవ్వని రైతులను బెదిరించి మరీ కొనుగోలు చేశాయి. ఇప్పుడు భూసేకరణ పూర్తయిందని వారందరినీ ఖాళీ చేయించడానికి పూనుకున్నాయి. దీంతో కాకినాడ సమీపంలోని తీరప్రాంతం రణరంగంగా మారింది. కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సుమారు 14 కిలోమీటర్ల పొడవునా సుమారు మూడు వేల ఎకరాల భూమిని పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకోవాలనుకున్న సెజ్‌ అధికారులకు చివరకు చేదు అనుభవం ఎదురైంది. కాగా సోమవారం రాత్రి నుంచే గ్రామాలను ముట్టడించేందుకు వ్యూహం రచించారు. జిల్లాలోని అన్ని స్టేషన్ల నుంచి పోలీసులను సమీకరించారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి శ్రీరాంపురం, మూలపేట, రావివారిపోడు గ్రామాల్లో సెజ్‌ వ్యతిరేక పోరాట నాయకుల గురించి గాలించారు.
(more…)

‘ఖాకీ’ నాడ సెజ్‌

Posted in వార్తలు by dilkibaatein on డిసెంబర్ 24, 2008

ఆంధ్రజ్యోతి నుండి…

తిరగబడ్డ రైతు బిడ్డ | భూమి కోసం పోలీసులపై పోరు
కాకినాడ సెజ్‌ గ్రాయాల్లో సర్కారు జులుం
| 11 గ్రామాలపై 2 వేల మంది పోలీసుల దాడి
భూముల స్వాధీనానికి యత్నం
| ఊళ్లు ఖాళీ చేయించే ప్రయోగం
క ర్రలతో తిరగబడిన బాధిత జనం
| చావనైనా చస్తాం,, ఈ నేల వదలం
సర్కారుపై ప్రజల నిరసన గళం
| తోకముడిచిన అధికారగణం
లాఠీచార్జి.. తోపులాటల్లో పలువురికి గాయాలు
| రణరంగాన్ని తలపించిన తీరం గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత

kakinada-sez-aj1


ఇద్దరు డీఎస్‌పీలు, పెద్దసంఖ్యలో సీఐలు, ఎస్‌ఐలతో సహా సుమారు రెండువేల మంది పోలీసులు… భారీగా రెవెన్యూ అధికారులు… వారితోపాటు ఫైరింజన్లు, 108 అంబులెన్స్‌లు! అంతా కలిసి 11 గ్రామాలపై ‘దాడి’ చేశారు. ఇది నక్సల్స్‌ కోసం వేట కాదు. సంఘ విద్రోహ శక్తులకోసం అన్వేషణ అంతకంటే కాదు. పొలాల చుట్టూ కంచెలు వేసి… కొన్ని గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించేందుకే ఈ దాడి!

అధికారుల ఆటవిక దాడిపై జనం ఆగ్రహించారు. ఎదురు తిరిగారు. తమ భూములు ఇచ్చేది లేదన్నారు. కంచెలు తొలగించారు. స్తంభాలను విరిచేశారు. ఆధిపత్యం కోసం అధికారుల ప్రయత్నం… బతుకు బాట కోసం సామాన్యుల పోరాటం… వెరసి ఆ దృశ్యం చిన్నసైజు సమరాన్ని తలపించింది. కాకినాడ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ కోసం చేపట్టిన భూ స్వాధీనం కోసం సర్కారు చేపట్టిన ‘నిర్బంధ కాండ’ ప్రస్తుతానికి విఫలమైంది.

(more…)

సెజ్‌ గ్రామాల్లో సర్కార్‌ జులుం

Posted in వార్తలు by JayaPrakash Telangana on డిసెంబర్ 24, 2008

భూముల స్వాధీనానికి విఫలయత్నం ఎదురుతిరిగిన బాధితులు

(ఆన్‌లైన్‌ ప్రతినిధి-కాకినాడ) కాకినాడ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (కెఎస్‌ఇజెడ్‌) కోసం భూముల్ని సేకరించేందుకు, గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం యంత్రాంగం మంగళవారం నాడు తెగబడింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన పదకొండు గ్రామాలపై సుమారు రెండు వేల మంది పోలీసులు విరుచుకుపడ్డారు.

(more…)